మళ్ళీరావా (2017)

ప్రతి ప్రేమకథలో రెండు ఘట్టాలుంటాయి, కలవడం, విడిపోవడం. ఈ రెండు అనుభవాలు క్షణకాలంలో జరిగిపోయినా, వాటి జ్ఞాపకాలు మాత్రం జీవితాంతం నిలిచిపోతాయి. ఆ జ్ఞాపకాల బరువుని మోయలేని సమయంలోనే అనిపిస్తుంది “మళ్ళీ రావా” అని. అదే పేరుతో తెరకెక్కిన ఈ సినిమాలో సుమంత్, ఆకాంక్ష సింగ్ జంటగా నటించారు. “గౌతమ్ తిన్ననూరి” దర్శకత్వం వహించగా “స్వధర్మ ఎంటర్టైన్మెంట్స్” పతాకంపై “రవి యాదవ్” నిర్మించారు. కథ : తను ప్రాణంగా ప్రేమించే తన చిన్ననాటి స్నేహితురాలు అంజలి (ఆకాంక్ష)…

Mental మదిలో (2017)

సినిమాకు కథ ఎంత ముఖ్యమో, ఆ కథను ఎంత నిజాయితీగా సదరు దర్శకుడు ప్రేక్షకులకు చెప్పాడన్నది కూడా అంతే ముఖ్యం. అలా, నిజాయితీగా తీసిన సినిమా “మెంటల్ మదిలో”. శ్రీవిష్ణు, నివేథా, అమృత శ్రీనివాసన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా ద్వారా “వివేక్ ఆత్రేయ” దర్శకుడిగా పరిచయమయ్యాడు. “పెళ్ళిచూపులు”తో సినీ ప్రయాణాన్ని ప్రారంభించిన “రాజ్ కందుకూరి” తన “ధర్మపథ క్రియేషన్స్” పతాకంపై నిర్మించగా, “సురేష్ ప్రొడక్షన్స్” సంస్థ సమర్పణలో ఈ సినిమా విడుదలయింది. కథ :…

ఒక మనసు (2016)

వర్షంలో పాటంటే “చిటపటచినుకులు” అని మొదలుపెట్టినట్టు, ప్రేమకథంటే “రెండు మనసులు” అని మొదలుపెట్టడం సహజం. ఎన్నిసార్లు చెప్పినా, అవే మనసులు, అవే భావాలు. అంతకంటే గొప్పగా, కొత్తగా చెప్పడానికి ఏ ప్రేమకథలోనైనా ఏముంటుంది? అయినాసరే, ఇప్పటివరకు ప్రేమకథలతో బోలెడు సినిమాలొచ్చాయి. కాకపోతే, “రెండు మనసులు” అని మొదలుపెట్టకుండా దర్శకుడు “రామరాజు” తన కథను “ఒక మనసు” అని మొదలుపెట్టాడు. ఈయన పేరు, ఈయన తీసిన “మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు” సినిమా విడుదలయినట్టు చాలామందికి తెలియదు. మంచి అబిరుచి…