మనమంతా (2016)
ఒక దర్శకుడు ఎన్ని సినిమాలు తీశాడన్నది ముఖ్యం కాదు. మంచి సినిమాలు ఎన్ని తీశాడన్నది ముఖ్యం. “చంద్రశేఖర్ యేలేటి” విషయంలో ఇది ఋజువైంది. పరిశ్రమలో ఎన్నో ఏళ్ళుగా ఉన్నప్పటికీ ఆయన తీసిన సినిమాల సంఖ్య చాలా తక్కువ. ఎప్పుడు సినిమా తీసినా అందులో ఏదో ఒక కొత్త విషయం చెప్పడం ఆయన సృజనాత్మకతకు నిదర్శనం. మూడు సంవత్సరాల తరువాత ఆయన తీసిన సినిమా “మనమంతా”. సుప్రసిద్ధ మళయాళ నటుడు “మోహన్‌లాల్” మొదటిసారిగా తెలుగులో నటించిన ఈ సినిమాలో…