నల్లై అల్లై – అల్లై అల్లై
డబ్బింగ్ పాటల్లో శబ్దానికి సాహిత్యం లొంగడం పరిపాటి. ముఖ్యంగా, “ఏ.ఆర్.రెహమాన్” స్వరపరిచిన తమిళ పాటలు తెలుగలో అనువాదమైనప్పుడు ఈ పోకడ మరింత ఎక్కువగా కనిపిస్తుంది. కారణం, ఇదివరకే పాటను తమిళంలో రికార్డు చేయడం, దానికి తగ్గట్టుగా తెరపై నటుల లిప్ సింక్ ఉండడం, దాన్ని అనువదించే క్రమంలో ప్రేక్షకుడికి అనుభూతిని దూరం చేయకుండా ఆ లిప్ సింకుకి దగ్గరగా ఉండేలా పదాలుంటే బాగుంటుందని వారి అభిప్రాయం. ఈ అభిప్రాయం ఎన్నో పాటల పాలిట శాపంగా మారింది. తమిళంలో…