కృష్ణం వందే జగద్గురుమ్

పరిచయం: తెలుగు సినిమా ఆరంభం నుండి వచ్చిన అత్యుత్తమ పాటల్లో కృష్ణం వందే జగద్గురుమ్ పాట ఒకటని అనడంలో అతిశయోక్తి లేదు. “ఈ పాట వ్రాయడానికే నేను ఇన్నేళ్ళుగా చిత్రపరిశ్రమలో ఉన్నానేమో” అని రచయిత సీతారామశాస్త్రి గారు అన్నారంటే ఆ పాట ఆయన ప్రస్థానంలో ఆయనకెంత విలువైనదో అర్థం చేసుకోవచ్చు. కేవలం, ఆయన ప్రస్థానంలో మాత్రమే కాదు, తెలుగు సినిమా ప్రస్థానంలో కూడా ఈ పాట అంతే విలువైనది. శాస్త్రి గారు వ్రాసిన అన్ని పాటలు ఒక…

శమంతకమణి (2017)

ఒక సినిమాలో ఎంతమంది హీరోలున్నా వాళ్ళందరినీ మించిన హీరో ఒకటి ఉంటుంది. అదే కథ. ఇటీవల కథే హీరోగా వచ్చిన అతి తక్కువ సినిమాల్లో ఒకటి “శమంతకమణి“. నారా రోహిత్, సుధీర్ బాబు, సందీప్ కిషన్, ఆది మరియు రాజేంద్రప్రసాద్ ప్రాధాన పాత్రలు పోషించిన ఈ సినిమాకు “భలే మంచి రోజు”తో పరిచయమైన “శ్రీరామ్ ఆదిత్య” దర్శకత్వం వహించారు. “భవ్య క్రియేషన్స్” పతాకంపై “ఆనంద్ ప్రసాద్” నిర్మించారు. కథ : శమంతకమణి పేరు గల అయిదు కోట్ల…

నాని జెంటిల్‌మన్‌ (2016)

“గ్రహణం”తో అవార్డు సంపాదించినా, “అష్టాచమ్మ”తో హిట్టు కొట్టినా, “గోల్కొండ హైస్కూల్”తో విమర్శకుల మెప్పు పొందినా, “మోహన్ కృష్ణ ఇంద్రగంటి” పేరు పెద్దగా వినిపించలేదు. ఆయన ద్వారా పరిచయమైన “నాని” మళ్ళీ ఆయనతో కలిసి చేసిన సినిమా “నాని జెంటిల్‌మన్‌”. సురభి, నివేథా థామస్ హీరోయిన్లగా నటించగా, “ఆదిత్య 369”, “వంశానికొక్కడు”, “మిత్రుడు” లాంటి సినిమాలను నిర్మించిన “శివలెంక కృష్ణప్రసాద్” ఈ సినిమాను నిర్మించారు. కథ : ఓ విమాన ప్రయాణంలో పరిచయమవుతారు ఐశ్వర్య (సురభి), కాథరిన్ (నివేథా).…