జ్యో అచ్యుతానంద (2016)

ఒక సినిమా కథ వ్రాయడానికి ఏవేవో చదివేసి ఎక్కడో దూరంగా సన్యాసిలా బ్రతకాల్సిన అవసరంలేదు. తొంగిచూస్తే, ప్రతి మనిషి జీవితంలో బోలెడు కథలుంటాయి. వాటికి సరైన నాటకీయతను జోడించగలిగితే అవే సినిమా కథలవుతాయి. ఈ నిజాన్ని నమ్ముకున్న ఏ దర్శకుడూ పరాజయం పొందలేదు. అలాంటివారిలో “అవసరాల శ్రీనివాస్” ఒకడు. “ఊహలు గుసగుసలాడే”తో మెప్పించిన ఈయన ఈసారి “జ్యో అచ్యుతానంద” సినిమాతో మన ముందుకొచ్చారు. నారా రోహిత్, నాగశౌర్య, రెజీన నటించిన ఈ సినిమాను “వారాహి చలన చిత్రం”…

ఒక మనసు (2016)

వర్షంలో పాటంటే “చిటపటచినుకులు” అని మొదలుపెట్టినట్టు, ప్రేమకథంటే “రెండు మనసులు” అని మొదలుపెట్టడం సహజం. ఎన్నిసార్లు చెప్పినా, అవే మనసులు, అవే భావాలు. అంతకంటే గొప్పగా, కొత్తగా చెప్పడానికి ఏ ప్రేమకథలోనైనా ఏముంటుంది? అయినాసరే, ఇప్పటివరకు ప్రేమకథలతో బోలెడు సినిమాలొచ్చాయి. కాకపోతే, “రెండు మనసులు” అని మొదలుపెట్టకుండా దర్శకుడు “రామరాజు” తన కథను “ఒక మనసు” అని మొదలుపెట్టాడు. ఈయన పేరు, ఈయన తీసిన “మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు” సినిమా విడుదలయినట్టు చాలామందికి తెలియదు. మంచి అబిరుచి…

జాదూగాడు (2015)

తమను తాము నిరూపించుకోవాల్సిన సమయం ప్రతి ఒక్కరి జీవితంలో తప్పకుండా వస్తుంది. ముఖ్యంగా సినిమా వాళ్ళ జీవితాల్లో ఇది తరచుగా వస్తుంది. “ఒక రాజు ఒక రాణి”తో పరిచయమై, “చింతకాయల రవి”తో సుప్రసిద్ధమైన దర్శకుడు “యోగేష్”, “ఊహలు గుసగుసలాడే”తో ఆకట్టుకున్న “నాగశౌర్య” మాస్ చిత్రాలు కూడా చేయగలరు అని నిరూపించుకోవడానికి చేసిన ప్రయత్నమే “జాదూగాడు” అనే చిత్రం. నాగశౌర్య, సోనారిక జంటగా నటించగా, సత్య ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై వి.వి.ఎన్.ప్రసాద్ నిర్మించారు. కథ : ఎలాగోలా ఓ కోటి…