జ్యో అచ్యుతానంద (2016)

ఒక సినిమా కథ వ్రాయడానికి ఏవేవో చదివేసి ఎక్కడో దూరంగా సన్యాసిలా బ్రతకాల్సిన అవసరంలేదు. తొంగిచూస్తే, ప్రతి మనిషి జీవితంలో బోలెడు కథలుంటాయి. వాటికి సరైన నాటకీయతను జోడించగలిగితే అవే సినిమా కథలవుతాయి. ఈ నిజాన్ని నమ్ముకున్న ఏ దర్శకుడూ పరాజయం పొందలేదు. అలాంటివారిలో “అవసరాల శ్రీనివాస్” ఒకడు. “ఊహలు గుసగుసలాడే”తో మెప్పించిన ఈయన ఈసారి “జ్యో అచ్యుతానంద” సినిమాతో మన ముందుకొచ్చారు. నారా రోహిత్, నాగశౌర్య, రెజీన నటించిన ఈ సినిమాను “వారాహి చలన చిత్రం”…

కళ్యాణ వైభోగమే (2016)

ఇప్పటి పరిశ్రమలో కేవలం “ఒక్క” సినిమా “పరాజయం” ఆ దర్శకుడి సినీజీవితంపై చాలా ప్రభావం చూపిస్తోంది. తరువాత తనను తాను నిరూపించుకోవడానికి అగ్నిపరీక్ష పెడుతోంది. అలాంటి పరీక్ష ఎదురుకొన్న ఓ దర్శకురాలు “నందిని రెడ్డి”. మళ్ళీ తన శైలిలోకి వెళ్ళి ఆవిడ తీసిన సినిమా “కళ్యాణ వైభోగమే”. నాగ శౌర్య, మాళవిక జంటగా నటించిన ఈ సినిమాను “శ్రీ రంజిత్ మూవీస్” పతాకంపై దామోదర్ ప్రసాద్ నిర్మించారు. కథ : పెళ్ళి అనే అంశంపై గౌరవం లేని…