సావిత్రి (2016)

కమర్షియల్ తెలుగు సినిమాలో కథానాయికకు ఉన్న ప్రాధాన్యం చాలా తక్కువ. పైగా, పేరున్న కథానాయకుడు ఉంటే, అది కేవలం పాటలకే పరిమితం అవుతుంది. ఈ పోకడకు భిన్నంగా తెరకెక్కిన సినిమా “సావిత్రి”. నందిత, నారా రోహిత్ జంటగా నటించిన ఈ సినిమాకు “ప్రేమ ఇష్క్ కాదల్”తో పరిచయమైన “పవన్ సాదినేని” దర్శకత్వం వహించారు. “విజన్ ఫిలిం మేకర్స్” పతాకంపై “వీ.బీ.రాజేంద్రప్రసాద్” నిర్మించారు. కథ : చిన్నప్పటినుండి “పెళ్ళి” అంటే పిచ్చి ఇష్టంతో పెరిగిన సావిత్రి (నందిత)కి ఓ…

శంకరాభరణం (2015)

దర్శకుల హవా నడుస్తున్న ఇప్పటి సినీ పరిశ్రమలో రచయితకు సరైన గుర్తింపు దక్కడంలేదు. సొంత కథలతో సినిమా తీసే ఏ దర్శకుడైనా మొదట రచయిత అవతారం ఎత్తాల్సిందే. మాతా, పిత, గురువు, దైవం అనే సూత్రాన్ని సినిమా విషయంలో రచయిత, నిర్మాత, దర్శకుడు, ప్రేక్షకుడుగా ఆపాదించాలి. ప్రస్తుత పరిశ్రమలోని పరిస్థితుల్లోనూ తనకంటూ ఓ ముద్ర సంపాదించుకున్న రచయిత “కోన వెంకట్”. రచయితగానే కాకుండా నిర్మాతగానూ మారి ఆయన మలిచిన చిత్రం “శంకరాభరణం”. నిఖిల్, నందిత జంటగా నటించిన…

కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ (2015)

“రీమేక్” చిత్రాలు మన చిత్రసీమకు కొత్తేమీ కాదు. అలాంటి చిత్రాలు తీయడం తప్పు కూడా కాదు. కానీ ఓ భాషలోని చిత్రాన్ని మరో భాషలో తీయాలనుకున్నప్పుడు దాన్ని ఆ ప్రేక్షకులు మెచ్చే విధంగా అందులో మార్పులు చేయడం చాలా అవసరం. కన్నడ భాష నుండి మనం అరువుతెచ్చుకున్న చిత్రాలు తక్కువే. అలాంటి వాటిలో ఒకటి “కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ”. కన్నడలో విజయవంతమైన “చార్మినార్” చిత్రం ఆధారంగా రూపొందిన ఈ చిత్రానికి చార్మినార్ దర్శకుడైన “ఆర్.చంద్రు” దర్శకత్వం వహించారు.…