నాని జెంటిల్‌మన్ (2016)
“గ్రహణం”తో అవార్డు సంపాదించినా, “అష్టాచమ్మ”తో హిట్టు కొట్టినా, “గోల్కొండ హైస్కూల్”తో విమర్శకుల మెప్పు పొందినా, “మోహన్ కృష్ణ ఇంద్రగంటి” పేరు పెద్దగా వినిపించలేదు. ఆయన ద్వారా పరిచయమైన “నాని” మళ్ళీ ఆయనతో కలిసి చేసిన సినిమా “నాని జెంటిల్‌మన్”. సురభి, నివేథా థామస్ హీరోయిన్లగా నటించగా, “ఆదిత్య 369”, “వంశానికొక్కడు”, “మిత్రుడు” లాంటి సినిమాలను నిర్మించిన “శివలెంక కృష్ణప్రసాద్” ఈ సినిమాను నిర్మించారు. కథ : ఓ విమాన ప్రయాణంలో పరిచయమవుతారు ఐశ్వర్య (సురభి), కాథరిన్ (నివేథా).…