శమంతకమణి (2017)

ఒక సినిమాలో ఎంతమంది హీరోలున్నా వాళ్ళందరినీ మించిన హీరో ఒకటి ఉంటుంది. అదే కథ. ఇటీవల కథే హీరోగా వచ్చిన అతి తక్కువ సినిమాల్లో ఒకటి “శమంతకమణి“. నారా రోహిత్, సుధీర్ బాబు, సందీప్ కిషన్, ఆది మరియు రాజేంద్రప్రసాద్ ప్రాధాన పాత్రలు పోషించిన ఈ సినిమాకు “భలే మంచి రోజు”తో పరిచయమైన “శ్రీరామ్ ఆదిత్య” దర్శకత్వం వహించారు. “భవ్య క్రియేషన్స్” పతాకంపై “ఆనంద్ ప్రసాద్” నిర్మించారు. కథ : శమంతకమణి పేరు గల అయిదు కోట్ల…

జ్యో అచ్యుతానంద (2016)

ఒక సినిమా కథ వ్రాయడానికి ఏవేవో చదివేసి ఎక్కడో దూరంగా సన్యాసిలా బ్రతకాల్సిన అవసరంలేదు. తొంగిచూస్తే, ప్రతి మనిషి జీవితంలో బోలెడు కథలుంటాయి. వాటికి సరైన నాటకీయతను జోడించగలిగితే అవే సినిమా కథలవుతాయి. ఈ నిజాన్ని నమ్ముకున్న ఏ దర్శకుడూ పరాజయం పొందలేదు. అలాంటివారిలో “అవసరాల శ్రీనివాస్” ఒకడు. “ఊహలు గుసగుసలాడే”తో మెప్పించిన ఈయన ఈసారి “జ్యో అచ్యుతానంద” సినిమాతో మన ముందుకొచ్చారు. నారా రోహిత్, నాగశౌర్య, రెజీన నటించిన ఈ సినిమాను “వారాహి చలన చిత్రం”…

రాజా చెయ్యి వేస్తే (2016)

ఒక సినిమా చూడడానికి కారణం హీరో కావచ్చు, మరో సినిమాకు విలన్ కావచ్చు, ఇంకొక సినిమాకు దర్శకుడు లేదా నిర్మాత కావచ్చు, కొన్నిసార్లు ట్రైలర్ కావచ్చు. అంటే, ఎదో ఒక అంశం కోసమే సినిమా చూసే రోజుల్లో, పైన చెప్పిన అంశాలన్నీ ఒకే సినిమాలో వస్తే, అదే “రాజా చెయ్యి వేస్తే”. నారా రోహిత్, ఇషా తల్వార్ జంటగా నటించగా, నందమూరి తారకరత్న విలన్ గా నటించిన ఈ సినిమాకు “ప్రదీప్ చిలుకూరి” దర్శకుడు. “వారాహి చలన…