ధృవ (2016)

“కథకు హీరో కావాలి” అనే నిజాన్ని వదిలేసి “హీరోకి కథ కావాలి” అనే సూత్రాన్ని పాటిస్తున్న తెలుగు సినిమాకు ఆ నిజాన్ని నిరూపించడం కోసమే అప్పుడప్పుడు కొన్ని కథలు వస్తుంటాయి. ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే కథకు లోబడే ఉంటే సినిమా ఎంత అందంగా ఉంటుందో అవి చెబుతుంటాయి. అలాంటి సినిమానే “ధృవ“. తమిళ సినిమా “తని ఒరువన్“కి రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాను “సురేందర్రెడ్డి” దర్శకత్వం వహించగా, రాంచరణ్, రకుల్ జంటగా…