సైరా నరసింహారెడ్డి (2019)

యుద్ధంలో ఒక్కోసారి పోరాడే వీరుడికన్నా అతడిని నడిపించే సారథే ముఖ్యం. ఇది మహాభారతం సైతం చాటిన సత్యం. సినిమా విషయంలో కూడా అంతే. ఒక్కోసారి కథ, కథనాల కన్నా వాటిని తెరపై నడిపించే నటులే ముఖ్యమైపోతుంటారు. అంతా వారి చేతుల్లోనే ఉంటుంది. ఎటువంటి కథలకు ఎలాంటి నటులను ఎంపిక చేసుకోవాలో దర్శకుడికి స్పష్టత ఉంటే చాలు. అలా, సినిమాల్లో కాస్టింగుకున్న ప్రాముఖ్యతను చాటే చిత్రమే ‘సైరా నరసింహారెడ్డి’. ‘మెగాస్టార్ చిరంజీవి’ నటించిన 151వ సినిమా ఇది. అతడి…

ఒక మనసు (2016)

వర్షంలో పాటంటే “చిటపటచినుకులు” అని మొదలుపెట్టినట్టు, ప్రేమకథంటే “రెండు మనసులు” అని మొదలుపెట్టడం సహజం. ఎన్నిసార్లు చెప్పినా, అవే మనసులు, అవే భావాలు. అంతకంటే గొప్పగా, కొత్తగా చెప్పడానికి ఏ ప్రేమకథలోనైనా ఏముంటుంది? అయినాసరే, ఇప్పటివరకు ప్రేమకథలతో బోలెడు సినిమాలొచ్చాయి. కాకపోతే, “రెండు మనసులు” అని మొదలుపెట్టకుండా దర్శకుడు “రామరాజు” తన కథను “ఒక మనసు” అని మొదలుపెట్టాడు. ఈయన పేరు, ఈయన తీసిన “మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు” సినిమా విడుదలయినట్టు చాలామందికి తెలియదు. మంచి అబిరుచి…