“ఎన్టీఆర్” సినిమాలో ఎన్టీఆర్ పాట

“ఎన్టీఆర్ కథానాయకుడు” సినిమాలో మనసుని హత్తుకున్న ఒక (ఒకేఒక్క) సన్నివేశం… ప్రీ క్లైమాక్సులో సొంత రాజకీయపార్టీని ప్రకటించడానికి రామారావు సిద్ధమవుతాడు. రోజూ బయటకు వెళ్ళే సమయంలో తానుగా ఎదురువచ్చే భార్య తారకం ఆ రోజు ఎన్నిసార్లు పిలిచినా పలకదు. దిగులుపడ్డ రామారావు బయటకు రాగానే “ఎయిరుపోర్టు వరకే అన్నయ్య!” అంటాడు తమ్ముడు త్రివిక్రమరావు. కారులో కూర్చోవడానికి ముందుప్రక్కనున్న డోరు తీస్తాడు రామారావు. అప్పుడు కారు వెనుక సీటులో కూర్చొనివున్న తారకం కనబడుతుంది. రాజకీయాల్లోకి వెళ్ళడానికి మరోసారి ఆలోచించమని…