అరవింద సమేత వీరరాఘవ (2018)

రామాయణాన్ని మొదట వాల్మీకి రచించారు. ఆ తరువాత మొల్ల, గోన బుద్దారెడ్డి లాంటి కవులు కూడా రచించారు. అలాగే మహాభారతాన్ని మొదట వేదవ్యాసుడు రచించారు. ఆ తరువాత తెలుగు కవిత్రయం రచించారు. ఒకే కథను పలు రచయితలు మళ్ళీ మళ్ళీ రచించినా ప్రేక్షకులు చదివారు. దానికి కారణం, ఒకే కథను వేర్వేరు రచయితలు చెప్పిన కోణాలు. “అరవింద సమేత వీరరాఘవ” సినిమా కూడా అంతే. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో ఎన్నో సినిమాలు వచ్చాయి. మళ్ళీ అదే నేపథ్యంతో…

హలో! (2017)

సినిమా ప్రకటించినప్పటి నుండే ఈసారి ఎలాంటి సినిమాతో వస్తాడోనని ఆసక్తిని రేకెత్తించే దర్శకుల జాబితాలో “మనం”తో చేరిపోయాడు “విక్రమ్ కుమార్“. “24”లాంటి క్లిష్టమైన కథను కూడా అతి సులువుగా ప్రేక్షకుడికి అర్థమయ్యేలా చెప్పిన విక్రమ్ ఈసారి “హలో!” అంటూ అఖిల్, కళ్యాణి ప్రియదర్శిని జంటగా సినిమాను రూపోదించాడు. “అన్నపూర్ణ స్టూడియోస్” మరియు “మనం ఎంటర్ప్రైసెస్” నిర్మించిన ఈ సినిమాకు “అక్కినేని నాగార్జున” నిర్మాత. కథ : విడిపోయిన తన చిన్ననాటి స్నేహితురాలు జున్ను (కళ్యాణి) కోసం కొన్ని…

ధృవ (2016)

“కథకు హీరో కావాలి” అనే నిజాన్ని వదిలేసి “హీరోకి కథ కావాలి” అనే సూత్రాన్ని పాటిస్తున్న తెలుగు సినిమాకు ఆ నిజాన్ని నిరూపించడం కోసమే అప్పుడప్పుడు కొన్ని కథలు వస్తుంటాయి. ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే కథకు లోబడే ఉంటే సినిమా ఎంత అందంగా ఉంటుందో అవి చెబుతుంటాయి. అలాంటి సినిమానే “ధృవ“. తమిళ సినిమా “తని ఒరువన్“కి రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాను “సురేందర్రెడ్డి” దర్శకత్వం వహించగా, రాంచరణ్, రకుల్ జంటగా…