రాజా ది Great (2017)

కథలకు కొరత ఉందని చెప్పుకునే సినీపరిశ్రమలో ఇదివరకు చెప్పిన కథనే ప్రేక్షకుడికి మళ్ళీ చెప్పి అతడి మెప్పు పొందాలంటే, చెప్పే విధానం మార్చాలి. అందుకే, కొందరు దర్శకులు కథ మీద కన్నా కథనం మీద, పాత్రల మీద ఎక్కువ దృష్టి సారిస్తారు. ఇదే పద్ధతిని పాటించిన సినిమా “రాజా ది Great”. “అనిల్ రావిపూడి” దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో రవితేజ, మెహ్రీన్ జంటగా నటించగా, “శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్” పతాకంపై “దిల్ రాజు”, “శిరీష్” నిర్మించారు.…

ఎటాక్ (2016)

ప్రతీ సినిమాకు రివ్యూ వ్రాసే ముందు ఆ సినిమాపై ఓ అవగాహన, దాని గురించి ఏమి రాయాలో ఓ ఆలోచన ఉంటాయి. కానీ కొన్ని సినిమాల మీద వ్రాసే రివ్యూలను ఎలా మొదలుపెట్టాలో అసలు అర్థంకాదు. పైగా, అది “రాంగోపాల్ వర్మ” సినిమా అయితే, ఆ తికమక మరింత పెరుగుతుంది. అలాంటి ఓ వర్మ సినిమానే “ఎటాక్”. మంచు మనోజ్, సురభి జంటగా నటించగా, జగపతిబాబు, ప్రకాష్ రాజ్, వడ్డే నవీన్ ముఖ్యపాత్రల్లో నటించారు. “సి.కె.ఎంటర్టైన్మెంట్స్” పతాకంపై…

రుద్రమదేవి (2015)

తెలుగులో “తెలుగు” చరిత్రను చూపించిన చిత్రాలు చాలా తక్కువగా వచ్చాయి. మనకున్న గొప్ప చరిత్రలలో వీరనారి “రాణి రుద్రమదేవి” కథ ఒకటి. చాలామందికి ఆవిడ రాణిగా కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలించి వీరమరణం పొందిన స్త్రీగానే తెలుసు. కానీ ఆవిడ జీవితం చరిత్రలోకి ఎక్కిందంటే దాని వెనుక ఆవిడ పడిన కష్టాలెన్నో ఉన్నాయి. ఆ విషయాలకు దృశ్యరూపం కల్పిస్తూ, సృజనాత్మక దర్శకుడు “గుణశేఖర్” స్వీయనిర్మాణంలో రూపొందించిన చిత్రం “రుద్రమదేవి”. అనుష్క ప్రధాన పాత్రలో నటించగా, రానా, అల్లు అర్జున్,…