ఊపిరి (2016)

సాహసం శ్వాసగా సాగిపో – ఇది “ఒక్కడు” సినిమాలోని పాట, నాగచైతన్య నటించే సినిమా పేరు మాత్రమే కాదు. “అక్కినేని నాగార్జున” సినీజీవిత సూత్రం కూడా. “గీతాంజలి” తరువాత “శివ”, “నిన్నే పెళ్ళాడుత” తరువాత “అన్నమయ్య” లాగే యాభై కోట్ల సంపాదించిన “సోగ్గాడే చిన్నినాయనా” తరువాత ఆయన చేసిన మరో సాహసం “ఊపిరి”. “మున్నా”తో పరిచయమై “బృందావనం” మరియు “ఎవడు” సినిమాలతో క్లాస్ మరియు మాస్ ప్రేక్షకులకు దగ్గరైన దర్శకుడు “వంశీ పైడిపల్లి” ఈ సినిమాకు దర్శకుడు.…

శౌర్య (2016)

“సంతోషం”, “స్వాగతం”, “మిస్టర్ పర్ఫెక్ట్”, “గ్రీకువీరుడు” లాంటి సినిమాల వల్ల “దశరథ్” కుటుంబ చిత్రాల దర్శకుడిగా ప్రేక్షకుల చేత ముద్ర వేయించుకున్నారు. కేవలం కుటుంబ చిత్రాలే కాదు, ఇతర జోనర్లకు సంబంధించిన సినిమాలు కూడా తీయగలడని నిరూపించిన సినిమా “శౌర్య”. మంచు మనోజ్, రెజీనా జంటగా నటించిన ఈ సినిమాను “మల్కాపురం శివకుమార్” నిర్మించారు. కథ : తన ప్రేయసి నేత్ర (రెజీనా)ను హత్య చేశాడన్న నేరంపై పోలీసులు శౌర్య (మనోజ్)ను అరెస్ట్ చేస్తారు. ఆ తరువాత…

చీకటి రాజ్యం (2015)

ఎన్నో మరపురాని చిత్రాలను అందించిన “కమల్ హాసన్” నుండి ఓ చిత్రం వస్తోందంటే, ఆయన అభిమానుల్లో, సినీప్రియులలో ఎదో ఒక ఉత్సాహం. కారణం ఆయన ఏ కథలో నటించినా అందులో ఒక వైవిధ్యం ఉంటుందనే గట్టి నమ్మకం. అలాంటి ఉత్సాహాన్ని రేకెత్తించిన ఓ చిత్రం “చీకటి రాజ్యం”. దాదాపు ఆరేళ్ళ (2009లో వచ్చిన ఈనాడు) తరువాత నేరుగా తెలుగులో కమల్ చేసిన చిత్రం ఇదే. కమల్ అనుచరుడు “రాజేష్ ఎం సెల్వ” దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో…