బ్రహ్మోత్సవం (2016)

మన జీవితాలు అనుకున్న విధంగా సాగవు. అలా సాగితే అవి జీవితాలే కావు. ఒకవేళ సాగితే బాగుంటుందనే ఊహే “సినిమా”. నిజజీవితాన్ని సినిమాలో ఆవిష్కరిస్తే నిజంగానే బాగుంటుంది. “శ్రీకాంత అడ్డాల” తన “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు”లో అదే పనిచేసి మెప్పించాడు. అందులోని “వసుధైక కుటుంబం” అంశానికి ఈసారి “బ్రహ్మోత్సవం” అనే పేరు పెట్టి మన ముందుకొచ్చాడు. మహేష్ బాబు, సమంత, కాజల్, ప్రణీత, సత్యరాజ్, రేవతి, జయసుధ, రావురమేష్, నరేష్, తనికెళ్ళ భరణి, ఇలా పలువురు…

డైనమైట్ (2015)

ఓ చిత్రాన్ని మరో భాషలోకి దిగుమతి చేసుకున్నప్పుడు ఆ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా మార్పులు చేయాలి. కానీ వాటి వల్ల మూల కథ, కథనాలకు భంగం కలగకుండా చూసుకోవాలి. ఆ లెక్క కాస్త తప్పిన చిత్రం “డైనమైట్”. మంచి విష్ణు, ప్రణీత జంటగా “దేవ కట్టా” దర్శకత్వం వచించిన ఈ చిత్రం తమిళ చిత్రం “అరిమ నంబి” ఆధారంగా రూపొందింది. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై మంచు విష్ణు దీన్ని నిర్మించారు. కథ : ఓ సందర్భంలో…