ఇజం (2016)
సినిమా చర్చించని విషయం ఈ సమాజంలో లేదు. చర్చించే విధానంలో ఒక్కొక్కరిది ఒక్కో శైలి. ఓ సామాజిక అంశాన్ని “పూరి జగన్నాథ్” తన శైలిలో చర్చించిన సినిమా “ఇజం”. నందమూరి కళ్యాణ్‌రామ్, అదితి ఆర్య జంటగా చేసిన ఈ సినిమాకు కళ్యాణ్‌రామ్ నిర్మాత. కథ : మాఫియా డాన్ జావేద్ ఇబ్రహీం (జగపతిబాబు) కూతురు ఆలియా ఖాన్ (అదితి)ని ప్రేమించిన కళ్యాణ్‌రామ్ (కళ్యాణ్‌రామ్) హఠాత్తుగా వారినుండి పారిపోతాడు. అందుకు కారణమేంటి? అసలు కళ్యాణ్‌రామ్ ఎవరు? జావేద్, ఆలియాలను కలవడం వల్ల అతడికున్న…