సైజ్ జీరో (2015)
భూమ్మీద ప్రతి మనిషికి కష్టాలుంటాయి. ఒక్కో సమయంలో ఒక్కో రకమైన కష్టం అప్పటికి రాజ్యమేలుతుంది. ఈ కాలపు వారిని (ముఖ్యంగా అమ్మాయిలను) పట్టి పీడిస్తున్న సమస్య “బరువు”. దీనివల్ల ఎన్నో కష్టాలు, దీనికోసం ఎన్నో బాధలు. అసలు ఇది భూతద్దంలో చూడాల్సిన సమస్య కాదని, దీనికి పరిష్కారం తమ చేతిలోనే ఉందనే అంశంతో వచ్చిన చిత్రం “సైజ్ జీరో”. “అనుష్క” కథానాయికగా, ఆర్య, సోనాల్ చౌహాన్, ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్రానికి “అనగనగా…