శ్రీమంతుడు (2015)

సినిమాకు సామాజిక బాధ్యత ఉంది. సమాజానికి ఓ విషయాన్ని సినిమా చెప్పినంత బలంగా, సులువుగా మరే మాధ్యమం చెప్పలేదు. కానీ చివరికి సినిమా కూడా ఓ వ్యాపారమే. కనుక విషయాన్ని వ్యాపార సూత్రాలతో కలిపి చెప్తే అన్ని విధాలా లాభమని ఓ నమ్మకం. అలాంటి ప్రయత్నమే “శ్రీమంతుడు” చిత్రం. మహేష్ బాబు, శ్రుతిహాసన్ జంటగా నటించిన ఈ చిత్రానికి “కొరటాల శివ” దర్శకుడు. మైత్రి మూవీస్ పతాకంపై నవీన్, మోహన్, రవిశంకర్ నిర్మించారు. దీని ద్వారా మహేష్ బాబు…

టైగర్ (2015)

మన దేశంలో జనాభా ఎంతుందో కులమతాలు, ఆచారాలు అన్ని ఉన్నాయి. వాటిని అలవాట్లుగా కాకుండా హోదాగా, పరువుగా భావించేవారే ఎక్కువ. పరువు కోసం కన్నబిడ్డలను సైతం చంపుకునే పోకడ ఉత్తరభారతదేశంలో ఇంకా ఉంది. ఆ అంశాన్ని స్పృశిస్తూ, స్నేహం, ప్రేమ అనే అంశాల చుట్టూ తిరిగే కథే “టైగర్”. సందీప్ కిషన్, రాహుల్ రవీంద్రన్, సీరత్ కపూర్ ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ చిత్రం ద్వారా “వి.ఐ.ఆనంద్” దర్శకుడిగా పరిచయమయ్యారు. ఎన్.వి.ప్రసాద్ నిర్మించారు. కథ : చిన్నతనంలో అనాధాశ్రమంలో…