మహానటి (2018)

కనిపించే ప్రతి నవ్వు వెనుక సంతోషమే ఉండాలని లేదు. కనిపించే ప్రతి కన్నీటి వెనుక బాధ ఉండాలని కూడా లేదు. సినిమా నటుల విషయంలో ఇది వందశాతం నిజం. తెర మీద వాళ్ళు పంచే ఆనందమే ప్రేక్షకుడికి కనిపిస్తుంది కానీ అక్కడి వరకు రావడానికి వాళ్ళు తెర వెనుక వదిలేసిన విషాదం ఎవరికీ కనబడదు. ఆ విషాదాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తే, తారలు కూడా భూమి మీద పుట్టినవారే అన్న సంగతి అవగతం అవుతుంది. అసలు ఎప్పుడో…

రాజా ది Great (2017)

కథలకు కొరత ఉందని చెప్పుకునే సినీపరిశ్రమలో ఇదివరకు చెప్పిన కథనే ప్రేక్షకుడికి మళ్ళీ చెప్పి అతడి మెప్పు పొందాలంటే, చెప్పే విధానం మార్చాలి. అందుకే, కొందరు దర్శకులు కథ మీద కన్నా కథనం మీద, పాత్రల మీద ఎక్కువ దృష్టి సారిస్తారు. ఇదే పద్ధతిని పాటించిన సినిమా “రాజా ది Great”. “అనిల్ రావిపూడి” దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో రవితేజ, మెహ్రీన్ జంటగా నటించగా, “శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్” పతాకంపై “దిల్ రాజు”, “శిరీష్” నిర్మించారు.…

శమంతకమణి (2017)

ఒక సినిమాలో ఎంతమంది హీరోలున్నా వాళ్ళందరినీ మించిన హీరో ఒకటి ఉంటుంది. అదే కథ. ఇటీవల కథే హీరోగా వచ్చిన అతి తక్కువ సినిమాల్లో ఒకటి “శమంతకమణి“. నారా రోహిత్, సుధీర్ బాబు, సందీప్ కిషన్, ఆది మరియు రాజేంద్రప్రసాద్ ప్రాధాన పాత్రలు పోషించిన ఈ సినిమాకు “భలే మంచి రోజు”తో పరిచయమైన “శ్రీరామ్ ఆదిత్య” దర్శకత్వం వహించారు. “భవ్య క్రియేషన్స్” పతాకంపై “ఆనంద్ ప్రసాద్” నిర్మించారు. కథ : శమంతకమణి పేరు గల అయిదు కోట్ల…