దళపతి (1991) – ఆ మూడు ఘట్టాలు

ఈ సినిమా పేరు తలచుకోగానే గుర్తొచ్చేది మూడు అతి ముఖ్యమైన ఘట్టాలు. అవి కథనంలో క్రమంలోనే వస్తాయి. మొదటి ఘట్టం – సూర్య, పద్మల వివాహం నాకు అమితంగా నచ్చిన సినిమాల్లో ఈ సినిమా ముందువరుసలో ఉండడానికి కారణం ఈ ఘట్టం. మణిరత్నం ఎంత గొప్ప రచయితో ఓ దృష్టాంతం చూపింది కూడా ఈ ఘట్టమే. పురిటిలోనే తల్లికి దూరమైన కొడుకుగా, శాపగ్రస్తుడైన మహావీరుడుగా, మోసం చేత అర్థాంతరంగా చనిపోయిన రాజుగా మిక్కిలి సానుభూతి కలిగించేలా మహాభారతంలో…

కబాలి (2016)

  మందు కొట్టే అలవాటు లేనివారికి కూడా కిక్కెక్కించే మత్తు “రజినీకాంత్”. మందు పాతబడే కొద్ది దాని ఖరీదు పెరిగినట్టు, వయసు పైబడే కొద్ది రజిని సినిమాలకు అయ్యే ఖర్చు కూడా పెరుగుతోంది. అలాంటి ఓ సినిమానే “కబాలి”. కొందరు దర్శకులు కథను “కథ”గా చెప్పడంలో తడబడతారు కానీ దాన్ని తెరపై అద్భుతంగా ప్రదర్శించగలరు. కొందరేమో “కథ”గా చెప్పినప్పుడు అద్భుతంగా చెప్పగలరు కానీ దాన్ని తెరపై ప్రదర్శించడంలో తడబడతారు. ఈ సినిమా దర్శకుడు “రంజిత్”ని ఈ రెండో…