NTR కథానాయకుడు (2019)

ఈ సినిమా “డ్రామాటిక్ లిబర్టీ“ విపరీతంగా తీసుకొని తీయబడిన బయోపిక్కులా అనిపించింది. అది తప్పు కాదు, ఎందుకంటే డ్రామా లేని తెలుగు సినిమా కథ ఉప్పు, కారం లేని వంటకంలాంటిదని నా అభిప్రాయం. ఈ సినిమాలో ఎన్నో మంచి విషయాలున్నాయి. మొదటగా, ఎన్టీఆర్, ఏయన్నార్ల మధ్యనున్న స్నేహాన్ని చూపించిన విధానం, ఏయన్నారున్న సన్నివేశాల్లో ఆయనకు కూడా తగినంత గౌరవమిచ్చిన విధానం చాలా బాగున్నాయి. “సీతారామ కళ్యాణం” సినిమా కోసం ఎన్టీఆర్ పడిన శ్రమ “ఔరా!” అనిపించింది. “గుండమ్మ…

రారండోయ్ వేడుక చూద్దాం (2017)

ఒక సినిమాకు కథానాయకుడు ఎంత ముఖ్యమో, కథానాయిక కూడా అంతే ముఖ్యం. ఈ విషయాన్ని మర్చిపోయిన తెలుగు సినిమా దర్శకులు కేవలం నాయకుడికే ప్రాధాన్యం ఇస్తూ నాయికను కేవలం “పాట”బొమ్మగా వాడుకుంటున్నారు. ఆ తప్పు తన సినిమాతో చేయలేదు దర్శకుడు “కళ్యాణ్ కృష్ణ“. “రకుల్ ప్రీత్ సింగ్“, నాగచైతన్య జంటగా “రారండోయ్ వేడుక చూద్దాం” అనే సినిమాను కథానాయికను కేంద్రబిందువుగా చేసుకొని తీశాడు. ఈ సినిమాను “అన్నపూర్ణ స్టూడియోస్” పతాకంపై “అక్కినేని నాగార్జున” నిర్మించారు. కథ :…

ధృవ (2016)

“కథకు హీరో కావాలి” అనే నిజాన్ని వదిలేసి “హీరోకి కథ కావాలి” అనే సూత్రాన్ని పాటిస్తున్న తెలుగు సినిమాకు ఆ నిజాన్ని నిరూపించడం కోసమే అప్పుడప్పుడు కొన్ని కథలు వస్తుంటాయి. ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే కథకు లోబడే ఉంటే సినిమా ఎంత అందంగా ఉంటుందో అవి చెబుతుంటాయి. అలాంటి సినిమానే “ధృవ“. తమిళ సినిమా “తని ఒరువన్“కి రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాను “సురేందర్రెడ్డి” దర్శకత్వం వహించగా, రాంచరణ్, రకుల్ జంటగా…