బ్రహ్మోత్సవం (2016)
మన జీవితాలు అనుకున్న విధంగా సాగవు. అలా సాగితే అవి జీవితాలే కావు. ఒకవేళ సాగితే బాగుంటుందనే ఊహే “సినిమా”. నిజజీవితాన్ని సినిమాలో ఆవిష్కరిస్తే నిజంగానే బాగుంటుంది. “శ్రీకాంత అడ్డాల” తన “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు”లో అదే పనిచేసి మెప్పించాడు. అందులోని “వసుధైక కుటుంబం” అంశానికి ఈసారి “బ్రహ్మోత్సవం” అనే పేరు పెట్టి మన ముందుకొచ్చాడు. మహేష్ బాబు, సమంత, కాజల్, ప్రణీత, సత్యరాజ్, రేవతి, జయసుధ, రావురమేష్, నరేష్, తనికెళ్ళ భరణి, ఇలా పలువురు…