సాహసం శ్వాసగా సాగిపో (2016)
“అతడి సినిమా ఎప్పుడొస్తుంది?” అని ప్రేక్షకుడు ఎదురుచుసేలా చేసే దర్శకుల్లో “గౌతమ్ మేనన్” మొదటి వరసలోనే ఉంటారు. దీనికి కారణం జీవితాన్ని సినిమాగా చూపించాలనే ఆయన అభిరుచే. అదే “సూర్య సన్నాఫ్ కృష్ణన్”, “ఏ మాయ చేశావే” లాంటి సినిమాలను ప్రేక్షకుల మనస్సులో చెరగని ముద్రవేసింది. “ఏ మాయ చేశావే” తరువాత నాగచైతన్య, గౌతమ్ మేనన్ కలిసి చేసిన సినిమా “సాహసం శ్వాసగా సాగిపో“. మంజిమ మోహన్ కథానాయికగా పరిచయమైన ఈ సినిమాను “ద్వారక క్రియేషన్స్” పతాకంపై “మిర్యాల…