రాజా ది Great (2017)

కథలకు కొరత ఉందని చెప్పుకునే సినీపరిశ్రమలో ఇదివరకు చెప్పిన కథనే ప్రేక్షకుడికి మళ్ళీ చెప్పి అతడి మెప్పు పొందాలంటే, చెప్పే విధానం మార్చాలి. అందుకే, కొందరు దర్శకులు కథ మీద కన్నా కథనం మీద, పాత్రల మీద ఎక్కువ దృష్టి సారిస్తారు. ఇదే పద్ధతిని పాటించిన సినిమా “రాజా ది Great”. “అనిల్ రావిపూడి” దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో రవితేజ, మెహ్రీన్ జంటగా నటించగా, “శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్” పతాకంపై “దిల్ రాజు”, “శిరీష్” నిర్మించారు.…

సుప్రీమ్ (2016)

కథ, కథనాలు కొత్తవా, పాతవా అనే విషయాన్ని పక్కనబెడితే, ధియేటరుకి వచ్చిన ఒక సాధారణ ప్రేక్షకుడు మాత్రం సినిమా తనకు బోరు కొట్టకుండా ఆనందపరిస్తే చాలనుకుంటాడు. అలా ప్రేక్షకుడిని బోరు కొట్టించకుండా కూర్చోబెట్టే దర్శకులలో “అనిల్ రావిపూడి” ఒకడు కాగలడని తన మొదటి సినిమా “పటాస్” తెలిపింది. అతడి రెండో సినిమా “సుప్రీమ్” ఆ విషయాన్ని ధ్రువీకరించింది. సాయిధరమ్ తేజ్, రాశి ఖన్నా జంటగా నటించిన ఈ సినిమాను “శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్” పతాకంపై “శిరీష్” నిర్మించారు.…

రాజా చెయ్యి వేస్తే (2016)

ఒక సినిమా చూడడానికి కారణం హీరో కావచ్చు, మరో సినిమాకు విలన్ కావచ్చు, ఇంకొక సినిమాకు దర్శకుడు లేదా నిర్మాత కావచ్చు, కొన్నిసార్లు ట్రైలర్ కావచ్చు. అంటే, ఎదో ఒక అంశం కోసమే సినిమా చూసే రోజుల్లో, పైన చెప్పిన అంశాలన్నీ ఒకే సినిమాలో వస్తే, అదే “రాజా చెయ్యి వేస్తే”. నారా రోహిత్, ఇషా తల్వార్ జంటగా నటించగా, నందమూరి తారకరత్న విలన్ గా నటించిన ఈ సినిమాకు “ప్రదీప్ చిలుకూరి” దర్శకుడు. “వారాహి చలన…

రన్ (2016)

ఓ సినిమాను రీమేక్ చేయడం మాములుగా కాస్త కష్టమైన పనే. రీమేక్ చేయబోయే భాష ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకొని మార్పులు చేయాల్సివస్తుంది. కానీ కొన్ని సినిమాల విషయంలో అది అవసరంలేదు. దానితో దర్శకుడి పని సులువు అయిపోతుంది. అలాంటి సినిమానే “రన్”. సందీప్ కిషన్, అనిషా ఆంబ్రోస్ జంటగా నటించిన ఈ సినిమాకు 2013లో వచ్చిన మళయాళ సినిమా “నేరం” మాతృక. “మిస్టర్ నూకయ్య” తీసిన “అని కన్నెగంటి” ఈ సినిమాకు దర్శకుడు. “ఏ.కె.ఎంటర్టైన్మెంట్స్” పతాకంపై సుధాకర్, కిషోర్…

తుంటరి (2016)

ఇప్పుడున్న పరిశ్రమలో “విజయం” అనేది దర్శకుడికి, ఇటు కథానాయకుడికి ఎంతో కీలకమైనది. ఒక్క సినిమా పరాజయం పొందినా చాలు ఫలానా దర్శకుడి తలరాత మారిపోవడానికి. ఆ “ఒక్క” సినిమాను చూసుకునే మన కథానాయకులు ఆ దర్శకుడికి మళ్ళీ అవకాశం ఇవ్వాలా వద్దా అని ఆలోచిస్తుంటారు. కానీ కొందరు కథానాయకులు ఈ సూత్రానికి దూరంగా ఉంటారు. అలాంటి కొద్దిమందిలో ఒకరు “నారా రోహిత్”. మంచి అభిరుచిగల కథానాయకుడిగా పేరొందిన ఈయన “గుండెల్లో గోదారి”, “జోరు” సినిమాలతో పరిచయమైన దర్శకుడు…

టెర్రర్ (2016)

సినిమా పరిశ్రమలో “చిన్న సినిమా”, “పెద్ద సినిమా” అనే విభజన కొన్ని సినిమాల పట్ల శాపంగా మారాయని చెప్పాలి. కొన్ని సినిమాలు కనీసం విడుదల కూడా కాలేదంటే దానికి పేరుమోసిన నిర్మాణ సంస్థ, దర్శకుడు, హిట్టు లేని నటుడు ఉండడంతో పాటు, ఈ “చిన్న సినిమా” అనే బిరుదు కూడా ఉంటోంది. అలాంటి ఒక “చిన్న” సినిమానే “టెర్రర్”. శ్రీకాంత్, నిఖిత జంటగా నటించిన ఈ సినిమాకు “సతీష్ కాసెట్టి” దర్శకత్వం వహించారు. ఈయన గతంలో స్వాతి…

జత కలిసే (2015)

కొన్ని సినిమాలు హడావుడి లేకుండా వచ్చేస్తాయి. వచ్చాక చాలా బాగుందంట అనే ప్రచారంతో వస్తాయి. అలాంటి సినిమాయే “జత కలిసే”. అశ్విన్ బాబు, తేజస్వి మడివాడ జంటగా నటించిన ఈ సినిమాతో “రాకేశ్ శశి” దర్శకుడిగా పరిచయమయ్యారు. వారాహి చలనచిత్రం, ఓక్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. కథ : ఓ సాఫ్ట్వేర్ కంపెనీ అధినేత రుషి (అశ్విన్), ఐ.ఏ.ఎస్ ఇంటర్వ్యూకి హాజరు కాబోయే తేజస్వి (తేజస్వి) ఒకే కారులో ప్రయాణం చేయాల్సివస్తుంది. కానీ అంతకముందే వారిరువురి…