రన్ (2016)

ఓ సినిమాను రీమేక్ చేయడం మాములుగా కాస్త కష్టమైన పనే. రీమేక్ చేయబోయే భాష ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకొని మార్పులు చేయాల్సివస్తుంది. కానీ కొన్ని సినిమాల విషయంలో అది అవసరంలేదు. దానితో దర్శకుడి పని సులువు అయిపోతుంది. అలాంటి సినిమానే “రన్”. సందీప్ కిషన్, అనిషా ఆంబ్రోస్ జంటగా నటించిన ఈ సినిమాకు 2013లో వచ్చిన మళయాళ సినిమా “నేరం” మాతృక. “మిస్టర్ నూకయ్య” తీసిన “అని కన్నెగంటి” ఈ సినిమాకు దర్శకుడు. “ఏ.కె.ఎంటర్టైన్మెంట్స్” పతాకంపై సుధాకర్, కిషోర్…

తుంటరి (2016)

ఇప్పుడున్న పరిశ్రమలో “విజయం” అనేది దర్శకుడికి, ఇటు కథానాయకుడికి ఎంతో కీలకమైనది. ఒక్క సినిమా పరాజయం పొందినా చాలు ఫలానా దర్శకుడి తలరాత మారిపోవడానికి. ఆ “ఒక్క” సినిమాను చూసుకునే మన కథానాయకులు ఆ దర్శకుడికి మళ్ళీ అవకాశం ఇవ్వాలా వద్దా అని ఆలోచిస్తుంటారు. కానీ కొందరు కథానాయకులు ఈ సూత్రానికి దూరంగా ఉంటారు. అలాంటి కొద్దిమందిలో ఒకరు “నారా రోహిత్”. మంచి అభిరుచిగల కథానాయకుడిగా పేరొందిన ఈయన “గుండెల్లో గోదారి”, “జోరు” సినిమాలతో పరిచయమైన దర్శకుడు…

టెర్రర్ (2016)

సినిమా పరిశ్రమలో “చిన్న సినిమా”, “పెద్ద సినిమా” అనే విభజన కొన్ని సినిమాల పట్ల శాపంగా మారాయని చెప్పాలి. కొన్ని సినిమాలు కనీసం విడుదల కూడా కాలేదంటే దానికి పేరుమోసిన నిర్మాణ సంస్థ, దర్శకుడు, హిట్టు లేని నటుడు ఉండడంతో పాటు, ఈ “చిన్న సినిమా” అనే బిరుదు కూడా ఉంటోంది. అలాంటి ఒక “చిన్న” సినిమానే “టెర్రర్”. శ్రీకాంత్, నిఖిత జంటగా నటించిన ఈ సినిమాకు “సతీష్ కాసెట్టి” దర్శకత్వం వహించారు. ఈయన గతంలో స్వాతి…