Killing వీరప్పన్ (2016)

ఓ కథలో కథానాయకుడు, ప్రతినాయకుడు అని ఇద్దరు వ్యక్తులుంటారు. అందులో మొదటివాడు “మంచివాడు”, రెండోవాడు “చెడ్డవాడు” అయ్యుండాలి అనేది అనాదిగా వస్తున్న సినిమా సూత్రం. దాన్ని ఎప్పుడో బద్దలుకొట్టాడు “రామ్ గోపాల్ వర్మ”. అదే డాక్యుడ్రామా (docudrama) కథలను తీయడంలో వర్మని సిద్ధహస్తుడుని చేసింది కూడా. “రక్తచరిత్ర”, “26/11 ముంబై దాడులు” తరువాత అతడి తీసిన డాక్యుడ్రామా “Killing వీరప్పన్”. కన్నడలో తీసిన ఈ సినిమా అనువాదమై తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల 7వ తేదిన విడుదలయింది.…