‘శంకరాభరణం’లో నాకు అల్లు రామలింగయ్యే హీరో
శంకరాభరణం నాకు ఈ సినిమాలో అల్లు రామలింగయ్యే హీరో! ఏ సినిమా గురించైనా తలచుకున్నా లేదా మాట్లాడుకున్నా సహజంగా అది హీరోతోనే మొదలవుతుంది. నాకు ఈ సినిమా గురించి తలచుకున్నప్పుడల్లా మొదట అల్లు రామలింగయ్య గుర్తుకు వస్తారు. ఆ తరువాతే సోమయాజులు గుర్తుకు వస్తారు. అందుకే, నాకు ఈ సినిమాలో అల్లు రామలింగయ్యే హీరో! ఈ సినిమాకు ఆరోహణ, అవరోహణ శంకర శాస్త్రి అయితే తాళం మాధవాచార్యులు. తాళం లేకుండా ఒట్టి స్వరాలే ఆలపిస్తే, ఏ రాగమైనా…