మహానటి (2018)

కనిపించే ప్రతి నవ్వు వెనుక సంతోషమే ఉండాలని లేదు. కనిపించే ప్రతి కన్నీటి వెనుక బాధ ఉండాలని కూడా లేదు. సినిమా నటుల విషయంలో ఇది వందశాతం నిజం. తెర మీద వాళ్ళు పంచే ఆనందమే ప్రేక్షకుడికి కనిపిస్తుంది కానీ అక్కడి వరకు రావడానికి వాళ్ళు తెర వెనుక వదిలేసిన విషాదం ఎవరికీ కనబడదు. ఆ విషాదాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తే, తారలు కూడా భూమి మీద పుట్టినవారే అన్న సంగతి అవగతం అవుతుంది. అసలు ఎప్పుడో…

సావిత్రి (2016)

కమర్షియల్ తెలుగు సినిమాలో కథానాయికకు ఉన్న ప్రాధాన్యం చాలా తక్కువ. పైగా, పేరున్న కథానాయకుడు ఉంటే, అది కేవలం పాటలకే పరిమితం అవుతుంది. ఈ పోకడకు భిన్నంగా తెరకెక్కిన సినిమా “సావిత్రి”. నందిత, నారా రోహిత్ జంటగా నటించిన ఈ సినిమాకు “ప్రేమ ఇష్క్ కాదల్”తో పరిచయమైన “పవన్ సాదినేని” దర్శకత్వం వహించారు. “విజన్ ఫిలిం మేకర్స్” పతాకంపై “వీ.బీ.రాజేంద్రప్రసాద్” నిర్మించారు. కథ : చిన్నప్పటినుండి “పెళ్ళి” అంటే పిచ్చి ఇష్టంతో పెరిగిన సావిత్రి (నందిత)కి ఓ…