మహానటి (2018)

కనిపించే ప్రతి నవ్వు వెనుక సంతోషమే ఉండాలని లేదు. కనిపించే ప్రతి కన్నీటి వెనుక బాధ ఉండాలని కూడా లేదు. సినిమా నటుల విషయంలో ఇది వందశాతం నిజం. తెర మీద వాళ్ళు పంచే ఆనందమే ప్రేక్షకుడికి కనిపిస్తుంది కానీ అక్కడి వరకు రావడానికి వాళ్ళు తెర వెనుక వదిలేసిన విషాదం ఎవరికీ కనబడదు. ఆ విషాదాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తే, తారలు కూడా భూమి మీద పుట్టినవారే అన్న సంగతి అవగతం అవుతుంది. అసలు ఎప్పుడో…

Arjun Reddy (2017)

“మనిషి ఎలా బ్రతకాలో నిర్ణయించేది వ్యవస్థ కాదు. మనిషే వ్యవస్థ!” అని “ఆటోనగర్ సూర్య” సినిమాలో ఒక మాట ఉంది. ఇది “సినిమా” విషయంలో కూడా వర్తిస్తుంది. ఒక సినిమా అలా తీయాలి, ఇలా తీయాలి అని రూల్స్ ని పాటిస్తూ అదే చట్రంలో ఇరుక్కుపోతే సినిమా ఎప్పటికీ మారలేదు, ఎదగలేదు. మూస ట్రెండ్ తాళాలను బద్దలుగొట్టిన ఎలాంటి సినిమానైనా ప్రేక్షకుడు నెత్తిమీద పెట్టుకుంటాడు. “శివ“, “ఖుషి“, “అతడు” లాంటి సినిమాలు ఇందుకు ఉదాహరణలు. ఇప్పుడు ఇదే…