NTR కథానాయకుడు (2019)

ఈ సినిమా “డ్రామాటిక్ లిబర్టీ“ విపరీతంగా తీసుకొని తీయబడిన బయోపిక్కులా అనిపించింది. అది తప్పు కాదు, ఎందుకంటే డ్రామా లేని తెలుగు సినిమా కథ ఉప్పు, కారం లేని వంటకంలాంటిదని నా అభిప్రాయం. ఈ సినిమాలో ఎన్నో మంచి విషయాలున్నాయి. మొదటగా, ఎన్టీఆర్, ఏయన్నార్ల మధ్యనున్న స్నేహాన్ని చూపించిన విధానం, ఏయన్నారున్న సన్నివేశాల్లో ఆయనకు కూడా తగినంత గౌరవమిచ్చిన విధానం చాలా బాగున్నాయి. “సీతారామ కళ్యాణం” సినిమా కోసం ఎన్టీఆర్ పడిన శ్రమ “ఔరా!” అనిపించింది. “గుండమ్మ…

ఊపిరి (2016)

సాహసం శ్వాసగా సాగిపో – ఇది “ఒక్కడు” సినిమాలోని పాట, నాగచైతన్య నటించే సినిమా పేరు మాత్రమే కాదు. “అక్కినేని నాగార్జున” సినీజీవిత సూత్రం కూడా. “గీతాంజలి” తరువాత “శివ”, “నిన్నే పెళ్ళాడుత” తరువాత “అన్నమయ్య” లాగే యాభై కోట్ల సంపాదించిన “సోగ్గాడే చిన్నినాయనా” తరువాత ఆయన చేసిన మరో సాహసం “ఊపిరి”. “మున్నా”తో పరిచయమై “బృందావనం” మరియు “ఎవడు” సినిమాలతో క్లాస్ మరియు మాస్ ప్రేక్షకులకు దగ్గరైన దర్శకుడు “వంశీ పైడిపల్లి” ఈ సినిమాకు దర్శకుడు.…