గుంటూర్ టాకీస్ (2016)

రామాయణం కథను చాలామంది చెప్పారు. అందులో వాల్మీకిది ఒక శైలి, మొల్లది ఇంకో శైలి, గోన బుద్దారెడ్డిది మరో శైలి. మూడు కథలు ఆదరణ పొందాయంటే, వారి వారి శైలి వేరుగా ఉండడమే కారణం. సినిమా కూడా అంతే. ఒక కథను వేర్వేరు దర్శకులు తమ తమ శైలిని అనుసరిస్తూ చెప్పగలరు. అలాంటి దర్శకుల్లో “ప్రవీణ్ సత్తారు” ఒకరు. ఉదాహరణలు, మునుపు ఆయన తీసిన “ఎల్.బీ.డబ్ల్యు”, “రొటీన్ లవ్ స్టొరీ” మరియు “చందమామ కథలు”. ఈసారి “గుంటూర్…