నేను.. శైలజ… (2016)

“మనకు నచ్చిన సినిమాలు చేయడం కాదు, మనకు నప్పే సినిమాలు చేయాలి!” అనే మాట ఎక్కడో ఎవరో చెప్పినట్టు నాకు జ్ఞాపకం. “రామ్” విషయంలో ఈ వాక్యం అక్షరాల ఋజువైంది. “పండగ చేస్కో”, “శివమ్” లాంటి మూస సినిమాలతో విసిగించేసిన రామ్ ఈసారి ఓ చక్కని పసందైన ప్రేమకథతో వచ్చాడు. అదే, కీర్తి సురేష్ తో జంటగా నటించిన “నేను..శైలజ..”. 2015 ఆఖరులో వచ్చిన చెత్త సినిమాలతో విసిగిపోయిన ప్రేక్షకులకు కూడా 2016 మొదట్లో ఓ మంచి…

శివమ్ (2015)

మన తెలుగు సినిమాలో దర్శకుడికి, కథానాయకుడికి సమానమైన ప్రాముఖ్యత ఉంది. అంటే మార్పుకి దర్శకులతో పాటు కథానాయకులు కూడా నాంది పలకాలి. కానీ కొందరు కథానాయకుల్లో మార్పు అంత సులువుగా రాదు. అలాంటి కథానాయకుడే “రామ్”. ఇతడు కథానాయకుడిగా రూపొందిన “శివమ్” చిత్రం ద్వారా “శ్రీనివాస రెడ్డి” దర్శకుడిగా పరిచయమయ్యారు. “నాయకుడు”, “నువ్వేకావాలి”, “నువ్వు నాకు నచ్చావు”, “యువసేన” లాంటి అభిరుచి గల చిత్రాలు నిర్మించి 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న “స్రవంతి మూవీస్” పతాకంపై “స్రవంతి…