24 (2016)

గమనిక : మీరు చదవబోయే ఈ విశ్లేషణ పెద్దదిగా ఉండబోతోంది. ఓపిక, సమయం ఉంటేనే చదవండి… ఓ సినిమా కథ కనీసం ఓ కోటిమందికి నచ్చేలా ఉండాలట. తట్టిన ప్రతీ కథ కోటిమందికి నచ్చేలా ఉండదు కనుక మన దర్శకరచయితలు వారికి తట్టిన కథలకంటే అందరికీ నచ్చిన కథలనే వండేస్తుంటారు. కథ నచ్చాలంటే, ముందుగా అది అందరికీ అర్థమవ్వాలి. ఆ శ్రమ తీసుకునేవారు కూడా తక్కువే. ఈ విషయంలో కేవలం దర్శకరచయితలనే తప్పుబట్టకూడదు. మనలో చాలామంది అలాగే…

అఖిల్ – The Power of Jua (2015)

మామూలుగా సినిమాకు తెర వెనుక దర్శకుడు (తీసేవాడు), తెర ముందు ప్రేక్షకుడు (చూసేవాడు) ఉంటారు. కొన్ని సినిమాలకు తెరముందున్న ప్రేక్షకుడు కూడా దర్శకుడిగా మారుతాడు. సినిమాను చూసే ప్రేక్షకుడిలోనూ ఓ దర్శకుడు ఉంటాడన్న విషయాన్ని తమ సినిమాల ద్వారా తెలిపిన దర్శకుల్లో “వి.వి.వినాయక్”కు అగ్రతాంబూలం ఇవ్వాలి. కథ, కథనాలతో సంబంధం లేకుండా సినిమాను ఎలాగైనా నడిపించి మాస్ ప్రేక్షకుడి నాడి తెలిసిన స్టార్ దర్శకుడిగా పేరొందిన వినాయక్ ఈసారి అక్కినేని వంశపు వారసుడు “అక్కినేని అఖిల్”ను పరిచయం…