ఒక మనసు (2016)

వర్షంలో పాటంటే “చిటపటచినుకులు” అని మొదలుపెట్టినట్టు, ప్రేమకథంటే “రెండు మనసులు” అని మొదలుపెట్టడం సహజం. ఎన్నిసార్లు చెప్పినా, అవే మనసులు, అవే భావాలు. అంతకంటే గొప్పగా, కొత్తగా చెప్పడానికి ఏ ప్రేమకథలోనైనా ఏముంటుంది? అయినాసరే, ఇప్పటివరకు ప్రేమకథలతో బోలెడు సినిమాలొచ్చాయి. కాకపోతే, “రెండు మనసులు” అని మొదలుపెట్టకుండా దర్శకుడు “రామరాజు” తన కథను “ఒక మనసు” అని మొదలుపెట్టాడు. ఈయన పేరు, ఈయన తీసిన “మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు” సినిమా విడుదలయినట్టు చాలామందికి తెలియదు. మంచి అబిరుచి…

లోఫర్ (2015)

ఏ దర్శకుడైనా తన ప్రతి సినిమాను పూర్తి మనసుపెట్టి తీస్తాడు. కానీ పూరి జగన్నాథ్ లాంటి దర్శకులు మాత్రం తమ మనసును ఓ సినిమాలో ఉపయోగిస్తారు, మరో సినిమాలో ఉపయోగించరు. ఒకవేళ ఉపయోగిస్తే, “నేనింతే”, “టెంపర్” లాంటి సినిమాలు పుడతాయి. లేకపోతే “జ్యోతిలక్ష్మి”, “హార్ట్ ఎటాక్”లు వస్తాయి. విచిత్రంగా, పూరి ఈసారి “సగం” మనసుపెట్టి ఓ చిత్రం తీశాడు. అదే “లోఫర్”. వరుణ్ తేజ్, దిషా పటాని జంటగా రూపొందిన ఈ చిత్రాన్ని సి. కళ్యాణ్ నిర్మించారు.…