నాని జెంటిల్‌మన్‌ (2016)

“గ్రహణం”తో అవార్డు సంపాదించినా, “అష్టాచమ్మ”తో హిట్టు కొట్టినా, “గోల్కొండ హైస్కూల్”తో విమర్శకుల మెప్పు పొందినా, “మోహన్ కృష్ణ ఇంద్రగంటి” పేరు పెద్దగా వినిపించలేదు. ఆయన ద్వారా పరిచయమైన “నాని” మళ్ళీ ఆయనతో కలిసి చేసిన సినిమా “నాని జెంటిల్‌మన్‌”. సురభి, నివేథా థామస్ హీరోయిన్లగా నటించగా, “ఆదిత్య 369”, “వంశానికొక్కడు”, “మిత్రుడు” లాంటి సినిమాలను నిర్మించిన “శివలెంక కృష్ణప్రసాద్” ఈ సినిమాను నిర్మించారు. కథ : ఓ విమాన ప్రయాణంలో పరిచయమవుతారు ఐశ్వర్య (సురభి), కాథరిన్ (నివేథా).…

ఎటాక్ (2016)

ప్రతీ సినిమాకు రివ్యూ వ్రాసే ముందు ఆ సినిమాపై ఓ అవగాహన, దాని గురించి ఏమి రాయాలో ఓ ఆలోచన ఉంటాయి. కానీ కొన్ని సినిమాల మీద వ్రాసే రివ్యూలను ఎలా మొదలుపెట్టాలో అసలు అర్థంకాదు. పైగా, అది “రాంగోపాల్ వర్మ” సినిమా అయితే, ఆ తికమక మరింత పెరుగుతుంది. అలాంటి ఓ వర్మ సినిమానే “ఎటాక్”. మంచు మనోజ్, సురభి జంటగా నటించగా, జగపతిబాబు, ప్రకాష్ రాజ్, వడ్డే నవీన్ ముఖ్యపాత్రల్లో నటించారు. “సి.కె.ఎంటర్టైన్మెంట్స్” పతాకంపై…

ఎక్స్‌ప్రెస్ రాజా (2016)

సినిమాకు పండగలు ఎంతో కీలకం. ముఖ్యంగా సంక్రాంతి పండుగ మన కథానాయకులకు ఆయువుపట్టు. ఇలాంటి పండుగలతో సంబంధం లేని కథానాయకులు కూడా ఉంటారు. ఉదాహరణకు శర్వానంద్ లాంటివారు. కానీ ఈసారి అగ్రనటుల సినిమాలతో పాటు శర్వానంద్ సినిమా కూడా సంక్రాంతి బరిలో దిగింది. అదే “ఎక్స్‌ప్రెస్ రాజా”. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ తో పరిచయమైన “మేర్లపాక గాంధీ” ఈ సినిమాకు దర్శకుడు. సురభి కథానాయిక. యువీ క్రియేషన్స్ పతాకంపై వంశీ-ప్రమోద్ ఈ సినిమాను నిర్మించారు. కథ : నిరుద్యోగి అయిన…