అరవింద సమేత వీరరాఘవ (2018)

రామాయణాన్ని మొదట వాల్మీకి రచించారు. ఆ తరువాత మొల్ల, గోన బుద్దారెడ్డి లాంటి కవులు కూడా రచించారు. అలాగే మహాభారతాన్ని మొదట వేదవ్యాసుడు రచించారు. ఆ తరువాత తెలుగు కవిత్రయం రచించారు. ఒకే కథను పలు రచయితలు మళ్ళీ మళ్ళీ రచించినా ప్రేక్షకులు చదివారు. దానికి కారణం, ఒకే కథను వేర్వేరు రచయితలు చెప్పిన కోణాలు. “అరవింద సమేత వీరరాఘవ” సినిమా కూడా అంతే. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో ఎన్నో సినిమాలు వచ్చాయి. మళ్ళీ అదే నేపథ్యంతో…

అఆ (2016)

త్రివిక్రమ్ కమర్షియల్ చట్రంలో ఇరుక్కుపోయి కనుమరుగైపోయాడని బాధపడిన వారిలో నేనూ ఒకడిని. కమర్షియల్ దర్శకుడిగా అగ్రస్థానంలో మెలుగుతున్న త్రివిక్రమ్ తిరిగి ఓనమాలు దిద్దే ప్రయత్నం చేసిన సినిమా “అఆ”. “అనసూయ రామలింగం v/s ఆనంద్ విహారి” అనేది ఉపశీర్షిక. సమంత, నితిన్, అనుపమ పరమేశ్వరన్ నటించిన ఈ సినిమాను “సూర్యదేవర రాధాకృష్ణ” నిర్మించారు. మొదట, ఈ సినిమా 1973లో విజయనిర్మల గారి దర్శకత్వంలో వచ్చిన “మీనా” సినిమాను కాపీ కొట్టి తీశారని చెప్పారు. తరువాత త్రివిక్రమ్ “యద్దనపూడి”…