పటేల్ S.I.R (2017)

ప్రదర్శన ఎలా ఉన్నా ప్రతి మనిషిలో కలిగే భావోద్వేగాలు ఒక్కటే. అలాగే సినిమా కథలు కూడా. ప్రదర్శనలు ఎలా ఉన్నా, కొన్ని సినిమాలలో మూల కథా వస్తువు ఒకటే ఉంటుంది. వాడిన వస్తువునే ఎంత కొత్తగా వాడామన్నదే ముఖ్యం ఇలాంటి సినిమాలకు. అలాంటి కథావస్తువుతో వచ్చిన సినిమానే “పటేల్ S.I.R“. వారాహి చలనచిత్రం నిర్మాణంలో “జగపతిబాబు”  హీరోగా నటించిన ఈ సినిమా ద్వారా “వాసు పరిమి” దర్శకుడిగా పరిచయమయ్యాడు. కథ : ఒక డ్రగ్స్ మాఫియాలోని వ్యక్తులను…

జ్యో అచ్యుతానంద (2016)

ఒక సినిమా కథ వ్రాయడానికి ఏవేవో చదివేసి ఎక్కడో దూరంగా సన్యాసిలా బ్రతకాల్సిన అవసరంలేదు. తొంగిచూస్తే, ప్రతి మనిషి జీవితంలో బోలెడు కథలుంటాయి. వాటికి సరైన నాటకీయతను జోడించగలిగితే అవే సినిమా కథలవుతాయి. ఈ నిజాన్ని నమ్ముకున్న ఏ దర్శకుడూ పరాజయం పొందలేదు. అలాంటివారిలో “అవసరాల శ్రీనివాస్” ఒకడు. “ఊహలు గుసగుసలాడే”తో మెప్పించిన ఈయన ఈసారి “జ్యో అచ్యుతానంద” సినిమాతో మన ముందుకొచ్చారు. నారా రోహిత్, నాగశౌర్య, రెజీన నటించిన ఈ సినిమాను “వారాహి చలన చిత్రం”…

మనమంతా (2016)

ఒక దర్శకుడు ఎన్ని సినిమాలు తీశాడన్నది ముఖ్యం కాదు. మంచి సినిమాలు ఎన్ని తీశాడన్నది ముఖ్యం. “చంద్రశేఖర్ యేలేటి” విషయంలో ఇది ఋజువైంది. పరిశ్రమలో ఎన్నో ఏళ్ళుగా ఉన్నప్పటికీ ఆయన తీసిన సినిమాల సంఖ్య చాలా తక్కువ. ఎప్పుడు సినిమా తీసినా అందులో ఏదో ఒక కొత్త విషయం చెప్పడం ఆయన సృజనాత్మకతకు నిదర్శనం. మూడు సంవత్సరాల తరువాత ఆయన తీసిన సినిమా “మనమంతా”. సుప్రసిద్ధ మళయాళ నటుడు “మోహన్‌లాల్” మొదటిసారిగా తెలుగులో నటించిన ఈ సినిమాలో…