మజ్ను (2016)
వందేళ్ళ సినిమా చరిత్రలో అన్ని రకాల కథలు వచ్చేశాయి. ఆ రకాలన్నింటినీ దాటుకొని పుట్టడానికి కొత్త కథేమి మిగలలేదు. మిగిలిందల్లా కొత్త కథనాలే. అందుకే ఈ మధ్య దర్శకులు కథకంటే ఎక్కువగా కథనం మీదే దృష్టి సారిస్తున్నారు. ఎంచుకున్న మూలకథ ఎంత పాతదైనా దాన్ని ఎంత కొత్తగా చెప్పగలమా అని చూస్తున్నారు. అలాంటి ఓ పాత కథే “మజ్ను“. నాని, అను, ప్రియశ్రీ నటించిన ఈ సినిమాకు “విరించి వర్మ” దర్శకుడు. “ఆనంది ఆర్ట్ క్రియేషన్స్“, “కేవా…