తుంటరి (2016)

ఇప్పుడున్న పరిశ్రమలో “విజయం” అనేది దర్శకుడికి, ఇటు కథానాయకుడికి ఎంతో కీలకమైనది. ఒక్క సినిమా పరాజయం పొందినా చాలు ఫలానా దర్శకుడి తలరాత మారిపోవడానికి. ఆ “ఒక్క” సినిమాను చూసుకునే మన కథానాయకులు ఆ దర్శకుడికి మళ్ళీ అవకాశం ఇవ్వాలా వద్దా అని ఆలోచిస్తుంటారు. కానీ కొందరు కథానాయకులు ఈ సూత్రానికి దూరంగా ఉంటారు. అలాంటి కొద్దిమందిలో ఒకరు “నారా రోహిత్”. మంచి అభిరుచిగల కథానాయకుడిగా పేరొందిన ఈయన “గుండెల్లో గోదారి”, “జోరు” సినిమాలతో పరిచయమైన దర్శకుడు…

క్షణం (2016)

ఓ దర్శకుడికి తన మొదటి సినిమా చాలా ముఖ్యం. ఎందుకంటే, అతడు తరువాత పరిశ్రమలో నిలబడతాడా లేదా అన్నది నిర్ణయించేది ఆ సినిమానే కనుక. అందుకే ఇప్పుడు పరిచయమయ్యే చాలామంది కొత్త దర్శకులు ఫార్ములాల మీద ఆధారపడుతున్నారు. వాటికి భిన్నంగా, “రవికాంత్ పెరేపు” అనే దర్శకుడు ఓ “సరైన” థ్రిల్లర్ సినిమాతో పరిచయం అయ్యాడు. అదే “క్షణం”. అడివి శేష్, అదా శర్మ, అనసూయ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు అడివి శేష్ కథను అందించాడు.…