విద్యాసాగర్ – మళయాళ సినిమాను ఏలిన తెలుగు సంగీతకారుడు

ఈ రోజు సంగీత దర్శకుడు “విద్యాసాగర్” పుట్టినరోజు. ఈయన సంగీతం చాలా ప్రత్యేకంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. తెలుగులో దిగ్దర్శకులతో పని చేసినా దురదృష్టవశాత్తూ ఆ సినిమాలు ఆదరణ పొందకపోవడంతో జనాలకు ఎక్కువగా గుర్తులేరు. కానీ మళయాళంలో జయకేతనం ఎగురవేశారు. ఈ సందర్భంగా నాకు నచ్చిన కొన్ని పాటలు… తెలుగు ప్రేక్షకులకు గుర్తుచేయాలన్న ఉద్దేశంతో ఎక్కువగా తెలుగు పాటలే పంచుకుంటాను. అడపాదడపా పరభాషా పాటలు. ఇందులో ఎటువంటి క్రమమూ లేదు ఇది నాదని అది నీదని – స్వరాభిషేకం…